- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నారి కష్టం చూసి కన్నీరు పెట్టిన RP Patnayak.. సంచలన నిర్ణయం (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: సింగర్ ఆర్‌పి పట్నాయక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. నటుడిగా రచయితగా, దర్శకుడిగా సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మనలో ఒకడు, శ్రీను వాసంతి లక్ష్మి, బ్రోకర్, తులసీదళం వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.
తాజాగా, ఆర్‌పి పట్నాయక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. అందులో ఓ పాప స్కూల్ బ్యాగ్‌లో ఫుల్లుగా బుక్కులు ఉండటంలో ఆ బరువును మోయలేక చాలా ఇబ్బంది పడుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత అది చూసిన ఓ వ్యక్తి వచ్చి ఆ అమ్మాయికి సహాయం చేస్తాడు.
ఈ వీడియోను ఆర్‌పి షేర్ చేస్తూ ‘‘ఈ వీడియో నాకు చాలా డిస్టబ్ చేసింది. ఏడుపు ఆగలేదు. ఈ స్కూల్ బ్యాగ్స్ బరువు విషయం లో స్కూల్స్, ప్రభుత్వాలు బాధ్యతగా పిల్లలని దృష్టిలో పెట్టుకొని దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి. లేకపోతే దీనిమీద ఒక ఉద్యమం చెయ్యాలని అనుకుంటున్నాను. ఎందరు నాతో జాయిన్ అవుతారో చెప్పండి. నేను పిల్లల తరపున పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు మేమంతా మీతో ఉంటామని కామెంట్లు చేస్తూ సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
ఇవి కూడా చదవండి: ఆ అమ్మాయి కోసం సూసైడ్ చేసుకోవాలనుకున్న ప్రేమదేశం మూవీ హీరో?