- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Mrunal Thakur: ప్రభాస్‌తో రొమాన్స్.. క్లారిటీ ఇస్తూ బిగ్ బాంబ్ పేల్చిన మృణాల్ పోస్ట్ వైరల్
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు సీతారామం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయి.. మొదటి చిత్రంతోనే హిట్ కొట్టింది. అంతేకాకుండా మృణాల్ తన నటన, అందం, అభినయంతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు హాయ్ నాన్నతో సూపర్ హిట్ అందుకుని క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. . ఇక ఇటీవల ఈ అమ్మడు ప్రభాస్ కల్కిలో కూడా కీలక పాత్రలో నటించి మెప్పించింది. ప్రజెంట్ ఈ భామ బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటిస్తుంది. అయితే డార్లింగ్, హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మృణాల్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు గత కొద్ది రోజుల నుంచి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. అయినప్పటికీ అంతా మృణాల్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ఫిక్స్ అయిపోయారు.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ నెటిజన్ ఇది ప్రభాస్ నటిస్తున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కదా అని పోస్ట్ షేర్ చేశాడు. ఇక అది చూసిన మృణాల్ స్పందిస్తూ.. మీ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెడుతున్నందుకు క్షమించండి. నేను ఈ ప్రాజెక్ట్‌లో లేను’’ అని రిప్లై ఇచ్చింది. ప్రజెంట్ మృణాల్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు బిగ్ బాంబ్ పేల్చిందని కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రభాస్ సరసన రొమాన్స్ చేసేది ఎవరా అని? ఫ్యాన్స్ ఆలోచనలో పడిపోయారు. కాగా, పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ కూడా పెట్టాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.