- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూర్య 'రోలెక్స్' క్రేజ్.. సౌత్‌లో బిగ్గెస్ట్ మూవీగా 'విక్రమ్' సీక్వెల్
దిశ, సినిమా : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' మూవీ సౌత్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. కమల్‌తో పాటు ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి తమదైన స్క్రీన్ ప్రజెన్స్‌తో ఈ సినిమా స్థాయిని పెంచేయగా.. కమల్‌కు ప్రధాన విరోధిగా, కేవలం ఐదు నిమిషాల సీన్‌తో హీరో సూర్య ఈ సినిమాలోని అన్ని పాత్రలను డామినేట్ చేశాడు. అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు ఎగ్జైట్‌మెంట్ పంచాడు. ఈ నేపథ్యంలో 'విక్రమ్' మూవీ చూసిన అభిమానులు సీక్వెల్ ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయతే డైరెక్టర్ లోకేష్ ప్రస్తుతం విజయ్‌తో ఓ సినిమా చేయబోతుండగా.. 'విక్రమ్' సీక్వెల్ ఉంటుందా? ఉంటే ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఐదు నిమిషాల రోల్‌తో థియేటర్‌లో ఈలలు వేయించిన సూర్య.. ఆ పాత్రలో పూర్తిస్థాయిలో కనిపిస్తే మూవీ మామూలుగా ఉండదని, సౌత్ ఇండియాలో అదే బిగ్గెస్ట్ మూవీ అవుతుందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.