షారుఖ్ రొమాన్స్ చూస్తూ ఇలా తయారయ్యాను.. అమెరికన్ నటి

by Hamsa |   ( Updated:2023-06-05 09:50:47.0  )
షారుఖ్ రొమాన్స్ చూస్తూ ఇలా తయారయ్యాను.. అమెరికన్ నటి
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌ను తెగ పొగిడేస్తోంది అమెరికన్ నటి రిచా మూర్జని. తాను యూఎస్‌కు చెందిన మహిళ అయినప్పటికీ షారుఖ్ అంటే చాలా ఇష్టమని, చిన్నప్పటి నుంచి అతని సినిమాలే చూస్తూ పెరిగానని చెప్పింది. అంతేకాదు నటన పరంగా షారుఖ్‌ను ఆదర్శవంతమైన వ్యక్తిగా పేర్కొన్న బ్యూటీ.. రొమాంటిక్ పరంగా అతన్నే మార్గదర్శకుడిగా భావిస్తానని తెలిపింది. ‘షారుఖ్ తన సినిమాలతో చాలామంది నిజ జీవితాలను తెరపై చూపిస్తాడు. అందుకే ఆ హీరో అంటే నాకు చాలా ఇష్టం. అలాగే నటి మాధురీ దీక్షిత్‌ను ఇన్సిపిరేషన్‌గా తీసుకుంటా. నేను నటిని కావాలని కోరిక కలగడానికి ఆమెనే కారణం’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో ప్రతి రోజు ఆ పని చేస్తున్న శృతి హాసన్.. అతనిది అంత పెద్దదని పట్టావా అంటున్న నెటిజన్లు

నా జీవితంలో మరపురాని క్షణం అది.. బుట్టబొమ్మ

Advertisement

Next Story