లైఫ్ అంటే ఆర్జీవీ మామదేరా.. అమ్మాయితో మందేస్తూ ఎంజాయ్ చేస్తోన్న పోస్ట్ వైరల్

by Anjali |   ( Updated:2024-02-05 14:53:42.0  )
లైఫ్ అంటే ఆర్జీవీ మామదేరా.. అమ్మాయితో మందేస్తూ ఎంజాయ్ చేస్తోన్న పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి సుపరిచితమే. తరచూ సినీ సెలబ్రిటీలు.. రాజకీయ నాయకుల పై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తారు. వివాదస్పదంగా మాట్లాడటంతో ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకోవచ్చు. నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతారని నెటిజన్ల అభిప్రాయం. ఇన్నాళ్లు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు వైసీపీకి సపోర్ట్‌గా ఉంటూ.. టీడీపీతో ఆడుకుంటున్నాడు. ఆ పార్టీ పై కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తూ.. నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాడు. ఇక అమ్మాయిలతో రాసలీలల విషయానికొస్తే.. మన ఇండియాలోనే స్వాతంత్రాన్ని పూర్తిగా వినియోగించుకునే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది ఈ డైరెక్టర్ మాత్రమే.

కంట్రావర్సీకే కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే ఆర్జీవీకి శృంగారం అండ్ మద్యం సేవించడం అంటే ఇష్టమని ఓపెన్‌గా చెప్తుంటాడు. నైనా గంగూలీ, అప్సర రాణి వంటి వారితో ఆర్జీవీ పబ్స్‌లో డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. తాజాగా ఈయన ఓ అమ్మాయితో మందు తాగుతోన్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసి.. చీర్స్.. మీరు కుళ్లుతో చచ్చిపోతే ఇంకో రెండు పెగ్గులేస్తా అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ వీక్షించిన నెటిజన్లు లైఫ్ అంటే వర్మ మామదేరా.. అంటూ కొందరు కామెంట్స్ చేయగా.. మరికొంతమంది మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టంట వైరల్ అవుతోంది.

Read More..

డీప్ ఫేక్ వీడియోపై మరోసారి స్పందించిన రష్మిక.. ప్రశ్నిస్తే దారుణంగా మాట్లాడుతున్నారు!

Advertisement

Next Story

Most Viewed