S. S. Rajamouli , Prashanth Neel కు కౌంటర్.. కార్తికేయ-2పై RGV ప్రశంసలు

by Hamsa |   ( Updated:2022-08-21 04:33:54.0  )
S. S. Rajamouli , Prashanth Neel కు కౌంటర్.. కార్తికేయ-2పై RGV ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం 'కార్తికేయ-2'. దీనికి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఆగస్టు 13న థియేటర్స్‌లో రిలీజై ఇటు తెలుగుతో పాటు బాలీవుడ్‌లో కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. తాజాగా, కార్తికేయ-2 మూవీపై వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు.

''రెండో శుక్రవారానికి కార్తికేయ-2 మూవీ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ సినిమాల కంటే డబుల్ కలెక్షన్స్ రాబట్టింది. రాజమౌళి RRR, ప్రశాంత్ నీల్ KGF-2 సినిమాల కంటే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. డైరెక్టర్ చందూ మొండేటికి అభినందనలు'' అంటూ ఆర్జీవి రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్లు రకరకాల మీమ్స్, కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story