‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి రేణు దేశాయ్ ఎమోషనల్ లుక్ రిలీజ్!

by Prasanna |   ( Updated:2023-10-03 12:28:32.0  )
‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి రేణు దేశాయ్ ఎమోషనల్ లుక్ రిలీజ్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ రాజా రవితేజ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒకటి. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే హీరో క్యారెక్టర్‌తో పాటు మురళీ శర్మ, అనుపమ్ ఖేర్ పోషించిన పాత్రలు టీజర్ ద్వారా పరిచయం చేయగా తాజాగా మరో పాత్రను రివీల్ చేశారు. ఈ మూవీలో నటి రేణు దేశాయ్ హేమలత లవణం అనే పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఆమెకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రేణు దేశాయ్ చాలా సింపుల్‌గా చేతిలో పసిబిడ్డని ఎత్తుకుని నవ్వుతూ కనిపించగా లుక్ చూసిన ఫ్యాన్స్ ఆమెను పొగిడేస్తూ సంబరపడిపోతున్నారు.

Advertisement

Next Story