- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Renu Desai: మీ కొడుకుకు స్త్రీలను గౌరవించడం నేర్పించండి.. నెట్టింట దుమారం రేపుతున్న రేణు దేశాయ్ సంచలన పోస్ట్
దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే. బద్రి, జాని వంటి సినిమాల్లో పవర్ స్టార్ సరసన నటించిన ఈమె.. ఆ సమయంలోనే వీరిద్దరు ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా అకీరా, ఆద్య అనే పిల్లలు కూడా జన్మించారు. కానీ, కొన్ని కారణాల రీత్యా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అలా విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాని మరో పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా.. తన పిల్లల బాధ్యతలను చూసుకుంటుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ యానిమల్స్‌కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా వాటికి కావాల్సిన విరాళాలు ఇవ్వడమే కాకుండా.. తమ అభిమానుల దగ్గర కూడా సాయం అడుగుతూ యానిమల్ లవర్ అనిపించుకుంటుంది.
ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా కోల్‌కత్తాలోని ఆర్‌జీ కర్ మెడికల్ హాస్పిటల్‌లో ఓ ట్రైనీ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ తరుణంలో దాదాపు చాలా మంది సెలబ్రిటీలు సైతం దీనిపై స్పందించారు. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ కూడా స్పందించి ఘటన జరిగిన రోజున నుంచి ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంది. తాజాగా రేణు దేశాయ్ ఆ ఘటనకు సంబంధించి సమాజంలో అమ్మాయిలు సమాజంలో బ్రతకాలంటే మార్షల్ ఆర్ట్ ఎంత ఇంపార్టెంటో అర్థం వచ్చేలా మరో పోస్ట్ పెట్టింది.
ఆ పోస్ట్‌లో భాగంగా.. స్త్రీలను గౌరవించడం మీ కొడుకుకు నేర్పించండి.. ఎందుకంటే నేను కూడా నా కుమార్తెకు ఎముకలు విరగొట్టడం నేర్పించబోతున్నాను అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో కరాటే నేర్పిస్తున్న ఫొటో పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు గుడ్ డెసిషన్ మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.