ఆయనకే ఫోన్ చేసి మాట్లాడతాను.. పవన్ కళ్యాణ్‌పై ప్రేమను బయటపెట్టిన రేణు దేశాయ్!

by Jakkula Samataha |   ( Updated:2024-06-08 09:25:21.0  )
ఆయనకే ఫోన్ చేసి మాట్లాడతాను.. పవన్ కళ్యాణ్‌పై ప్రేమను బయటపెట్టిన రేణు దేశాయ్!
X

దిశ, సినిమా : ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రేణు దేశాయ్ సందడే కనిపిస్తుంది. ఈమెకు సంబంధించిన అనేక వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తాను వరుసగా పోస్టులు పెడుతుంది. నాన్న విన్నింగ్ మూడ్‌లో అకిరా, ఆద్య అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేసింది. అలాగే తాజాగా పవన్ కళ్యాణ్, అకిరా నందన్ కలిసి ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. దీంతో రేణు దేశాయ్ భావోద్వేగానికి లోనైంది. అకీరా పీఎం వద్దకు వెళ్లడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పుకొచ్చింది.

అయితే ఆమె పోస్ట్ చూసిన కొందరు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అందులో ఓ నెటిజన్ మీరు చాలా పోస్టులు చేస్తున్నారు కానీ ఏ పోస్టులో పవన్ గురించి చెప్పడం లేదు ఎందుకు? వపన్ అన్నయ్య గురించి ఏమైనా చెప్పొచ్చు కదా వదిన గారు అంటూ ప్రశ్నించారు. దానికి రేణు దేశాయ్ రిప్లే ఇస్తూ.. మళ్లీ నేను ఏం చెప్పినా అందరూ అటెన్షన్ కోసమే మాట్లాడుతున్నాను అంటారు. ఏదైనా చెప్పాలి అనుకుంటే నేరుగా ఆయనకే ఫోన్ చేసి చెబుతాను కాబట్టి, మీరందరూ సంతోషంగా ఉండండి అని రిప్లే ఇచ్చింది. దీంతో కొందరు రేణుకు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ప్రేమ, ఆయనను ఇప్పటికీ రేణు దేశాయ్ ఇష్టపడుతుంది. ఎంతైనా ఒక మాజీ భార్యగా పవన్ మీద ప్రేమ, అభిమానం అలాగే ఉండనివ్వడం అనేది చాలా గ్రేట్.. అందుకే రేణు అలా రిప్లై ఇచ్చి, మనసులోని తన ప్రేమను బయట పెట్టింది అంటూ ముచ్చటిస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed