Renu Desai : ఆ విషయంలో హర్ట్ అయి ఇన్‌స్టాను వాడనంటున్న రేణూ దేశాయ్.. పవన్ కళ్యాణ్ కారణంగానేనా?

by Javid Pasha |   ( Updated:2024-05-29 07:09:05.0  )
Renu Desai : ఆ విషయంలో హర్ట్ అయి ఇన్‌స్టాను వాడనంటున్న రేణూ దేశాయ్.. పవన్ కళ్యాణ్ కారణంగానేనా?
X

దిశ, సినిమా : రేణూ దేశాయ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి నటిగా, పవన్ కళ్యా‌ణ్ మాజీ భార్యగా అందరికీ సుపరిచితమే. విడాకుల తర్వాత మూవీస్‌కు దూరంగా ఉంటున్న ఆమె సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు దగ్గరగా ఉంటున్నది. తరచూ తనకు, తన కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. కాగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పవర్ స్టార్ గురించి, తన పిల్లల గురించి, పెట్ డాగ్స్‌కు ఫండ్ రైజ్ గురించిన విషయాలను పంచుకుంటూ వార్తల్లో నిలిచింది రేణూ దేశాయ్.

ఏ విషయంలో అయినా రేణూ దేశాయ్ ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారానే స్పందిస్తుంది. ఆమె బంధువులు, అభిమానులు ఎవరైనా ఆమెను ప్రత్యక్షంగా సంప్రదించాలనుకున్నా కూడా, ముందుగా ఇన్ స్టా‌గ్రామ్‌ ద్వారానే ఆమెకు పర్సనల్‌గా మెసేజ్ సెండ్ చేస్తారని టాక్. అయితే తరచూ ఏదో ఒక అప్‌డేట్‌తో సోషల్ మీడియాలో హల్ చల్ చేసే రేణూ దేశాయ్ అప్పుడప్పుడూ ఇన్‌స్టాకు కాస్త బ్రేక్ కూడా ఇవ్వాలనుకుంటోందట.

కాగా రేణూ దేశాయ్ ఓ వారం రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నది. దీంతో ఆమె ఫాలోవర్లకు, అభిమానులకు రకరకాల అనుమానాలు వచ్చాయి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ విషయంలో పెట్టిన పోస్టులకు సంబంధించి ఆయన అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కోవడం, అలాగే పెట్‌డాగ్స్ కోసం విరాళాల విషయంలో పలువురు స్పందించడం, తనకు రూ. 3,500 కావాలని అభిమానులను రిక్వెస్ట్ చేయడం ఇన్‌స్టా‌గ్రామ్ వేదికగా ఆసక్తి రేకెత్తించాయి. ఆ విషయాల్లో రేణూ దేశాయ్ క్లారిటీ కూడా ఇచ్చింది. అయినప్పటికీ కొందరు నెటిజన్లు మాత్రం ‘పవన్ అన్న’పై పెట్టిన పోస్టులకు హర్ట్ అయి ఉంటుంది. అందుకే ఇన్‌స్టా‌కు బ్రేక్ ఇచ్చేసి వెకేషన్లకు వెళ్తోందని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed