Renu Desai: ఊహించిన దానికంటే తక్కువే.. పది మందే అలా చేశారంటూ పోస్ట్

by Hamsa |
Renu Desai: ఊహించిన దానికంటే తక్కువే.. పది మందే అలా చేశారంటూ పోస్ట్
X

దిశ, సినిమా: రేణు దేశాయ్, పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి పిల్లలు అకీరా నందన్, ఆద్య బాధ్యత తీసుకుని సినిమాలకు దూరం అయింది. ఇటీవల నాగేశ్వర రావు సినిమాలో నటించింది. కానీ గత కొద్ది కాలంగా దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. తనకూ తోచినంత సాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళం అడుగుతూ జంతు ప్రేమికురాలు అనిపించుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది.

ఈ క్రమంలో.. తాజాగా, ఓ పెట్‌కు సర్జరీ చేయించాలంటూ డొనేషన్ అడిగింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా దాని ఆరోగ్య పరిస్థితి చూపిస్తూ.. కొంత డబ్బులు ఇవ్వాలని కోరింది. అయితే దానికి పది మంది విరాళం అందచేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రేణు దేశాయ్ మరో పోస్ట్ ద్వారా తెలిపింది. ‘‘ నాకు 1.1 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ కేవలం పది మంది మాత్రమే విరాళం ఇచ్చారు. నేను చాలామంది డాగ్ లవర్స్ ఉన్నారని ఎక్కువే ఇస్తారని ఊహించాను’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story