- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా జీవితంలో ప్రేమ, పెళ్లికి చోటులేదు.. యంగ్ బ్యూటీ Regina Cassandra
దిశ, సినిమా : ప్రముఖ టాలీవుడ్ నటి రెజీనా కసాండ్రా ప్రేమ, పెళ్లిపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం 'శాకిని ఢాకిని' సినిమాతో సెప్టెంబరు 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నటి.. ప్రమోషన్స్‌లో భాగంగా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. ఈ మేరకు తన జీవితంలో ప్రేమ అనే అంశం 2020లోనే ముగిసిందన్న బ్యూటీ.. దాని నుంచి బయటపడేందుకు ఎంతో కష్టపడ్డానని, ప్రస్తుతం ఎవరినీ ప్రేమించడం లేదని, అలాంటి ఆలోచనలు కూడా మదిలోకి రానివ్వట్లేదని తెలిపింది.
అలాగే ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదని, తన జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదంటూ ఆసక్తికరంగా మాట్లాడింది. ఇక ఎదుటివారిపై ఆధారపడకుండా సొంతంగా జీవించడం ఎలాగో చిన్నతనంలోనే తన తల్లి నేర్పిందని, జీవితంలో తోడు కావాలా? వద్దా? అనే విషయం గురించి ప్రస్తుతం ఆలోచించనని చెప్పుకొచ్చింది. ఇక సౌత్ కొరియా యాక్షన్ కామెడీ 'మిడ్‌నైట్ రన్నర్స్'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.
Also Read: నా భర్తతో కమిట్ అవ్వడం ఇష్టం లేదు: షాకిచ్చిన స్టార్ హీరోయిన్