- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rayan movie : ఓటీటీలోకి రాయన్ మూవీ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాయన్ మూవీ థియేటర్స్‌లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇది తన 50వ సినిమా కావడంతో, అతని సినిమాకి ఆయనే దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈయన దర్శకత్వంలో పా.పాండి అనే సినిమా రాగా, ఇప్పుడు రాయన్ సీనిమా ద్వారా అభిమానుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ మూవీ మంచి హిట్ టాక్ అందుకుంటుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రాయన్(ధనుష్) తన తమ్ముళ్లు, చెల్లిని ఎలా పోషించుకుంటూ జీవిస్తాడనేది ఈ సినిమా కథ. కొందరి వలన తన కుటుంబం విడిపోతుంది. తన ఫ్యామిలీని ఛిన్నాభిన్నం చేసిన వారిపై రాయన్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటారానేది, ఈ సినిమాలో ధనుష్ చూపించారు.
జూలై26న థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. కాగా, దీనికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాయన్ మూవీ భారీ ధరకు ఓటీటీకి అమ్ముడు పోయినట్లు సమాచారం. ఈ సినిమాను సన్ నెక్స్ట్ సంస్థ కొనుగోలు చేసింది, ఈ సినిమాను సంస్థ సెప్టెంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
- Tags
- Rayan movie
- OTT