Raviteja Fans: హరీష్ శంకర్‌ను పొట్టు పొట్టు కొడతామంటున్న రవితేజ ఫ్యాన్స్‌..! దుమారం రేపుతోన్న వీడియో..

by Kavitha |   ( Updated:2024-08-15 15:49:16.0  )
Raviteja Fans: హరీష్ శంకర్‌ను పొట్టు పొట్టు కొడతామంటున్న రవితేజ ఫ్యాన్స్‌..! దుమారం రేపుతోన్న వీడియో..
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్‌’. ఈ మూవీలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అజయ్ దేవగన్ రైడ్ సినిమాకు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కిన ఈ చిత్రంలో జగపతి బాబు విలన్‌గా నటించాడు. కాగా ఈ మూవీ నేడు (ఆగస్టు 15) గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇదిలా ఉంటే.. బేసిక్‌గా హరీష్ శంకర్‌- రవితేజ కాంబో అనగానే భారీ అంచనాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. దీంతో మిస్టర్ బచ్చన్ పై కూడా ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే.. నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు పెట్టి రొటీన్ మాస్ కమర్షియల్ మూవీలా హరీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని కొందరు అభిమానులు మండిపడుతున్నారు. రీమేక్ సినిమా అయినా హరీష్‌ వాటిని తనదైన శైలిలో బాగా తీస్తాడని పేరుందని, అలాగే మిస్టర్ బచ్చన్‌ను కూడా తనదైన శైలిలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో చూపిస్తాడని భావించినట్లుగా చెబుతున్నారు. సినిమాలో అసలు పాయింట్ రైడ్ అయితే.. దాన్ని పక్కన పెట్టి.. పాటల కోసమే సినిమా తీశారు..కానీ, సినిమా కోసం పాటలు తీయలేదని మండిపడుతున్నారు.

సినిమాలో మంచి కంటెంట్ ఉంది. కానీ, డైరెక్షన్ మిస్సైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంగ్స్ తప్ప సినిమాలో ఏం లేదని, తామెన్నో అంచనాలతో మూవీకి వచ్చామని ఆ రేంజ్‌లో సినిమా లేదంటున్నారు. అంతేకాకుండా హరీష్ శంకర్ గనుక ఆర్టీసీ క్రాస్ రోడ్డు వస్తే రవితేజ ఫ్యాన్స్ పిచ్చ పిచ్చగా కొడతారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. మరి మీరు ఆ వీడియోను చూసేయండి.

(video link credits to vaibhav X account)

Advertisement

Next Story