రవితేజ నిర్మించిన 'మట్టి కుస్తీ' మూవీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్..!

by Hajipasha |
రవితేజ నిర్మించిన మట్టి కుస్తీ మూవీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్..!
X

దిశ, సినిమా: తమిళ నటుడు విష్ణు విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మట్టి కుస్తీ'. తమిళంలో 'గట్ట కుస్తీ'పేరుతో వస్తున్న సినిమాను మాస్ రాజా రవితేజ ప్రొడ్యూస్ చేస్తుండటంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక సినిమా పోస్టర్, టీజర్, ట్రైలర్ అమితంగా అంటుకున్నాయి. అయితే ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఐశ్వర్య లక్ష్మి రవితేజ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. 'ఈ మూవీని ప్రోడ్యుస్ చేసిన రవితేజ ఒకసారి కూడా షూటింగ్‌కి రాలేదు. విష్ణు విశాల్‌ని పూర్తిగా నమ్మి ఫైనల్ ప్రోడక్ట్‌ని మాత్రమే చూపించమన్నారు. ఫైనల్ అవుట్ పుట్‌ను చూసి హ్యాపీగా ఫీలయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మొదటిసారి రవితేజను కలిశాను. ఈ కథను నాకు మూడేళ్ల క్రితమే వినిపించారు. కానీ, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది' అని చెప్పింది.

Next Story

Most Viewed