Sudigali Sudheer 'Galodu ' నా కెరీర్‌ను మలుపుతిప్పింది : రవిరెడ్డి

by sudharani |   ( Updated:2022-11-26 14:02:16.0  )
Sudigali Sudheer  Galodu  నా కెరీర్‌ను మలుపుతిప్పింది : రవిరెడ్డి
X

దిశ, సినిమా : ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్లుగా ఒకే ఒక్క సినిమా తన కెరీర్‌‌ను మార్చేసిందంటున్నాడు రవి రెడ్డి. కొన్నేళ్లుగా బిగ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న తనకు 'గాలోడు' రూపంలో ఘన విజయం లభించిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన సంతోషాన్ని తాజాగా మీడియాతో పంచుకున్నాడు. 'గాలోడు సాధిస్తున్న అసాధారణ విజయం నన్ను గాల్లో విహరించేలా చేస్తోంది.

'ఇంటెలిజెంట్, దర్పణం, దొరసాని, డిగ్రీ కాలేజ్, వి, విరాటపర్వం, సాఫ్ట్‌వేర్ సుధీర్' వంటి చిత్రాలతో నటుడిగా ఇప్పటికే సత్తా చాటుకున్నా. కానీ ఈ చిత్రం సాధిస్తున్న సంచలన విజయంతో అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తున్నా. అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్‌లో మాస్టర్స్ చేయడంతో పాటు ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుని అక్కడ మోడలింగ్ కూడా చేశాను. ఇప్పుడు టాలీవుడ్‌లో పూర్తి స్థాయిలో నటనపై దృష్టి పెడుతున్నా. ఇందులో హీరోయిన్ ఫాదర్‌గా నటనకు ఆస్కారమున్న ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చి నా నట జీవితాన్ని మలుపు తిప్పిన దర్శకనిర్మాత రాజశేఖర్ రెడ్డి పులిచర్లకు ఎప్పటికీ రుణపడి ఉంటా' అని కృతజ్ఞతలు తెలిపాడు.

READ MORE

Jeevitha Rajasekhar కు సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపి..

Advertisement

Next Story