రేసుగుర్రం విలన్ రవికిషన్ ఇంట విషాదం

by Sathputhe Rajesh |
రేసుగుర్రం విలన్ రవికిషన్ ఇంట విషాదం
X

దిశ, సినిమా: బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్(రేస్‌గుర్రం ఫేమ్‌ విలన్) ఇంట విషాదం నెలకొంది. కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న తన సోదరుడు రమేశ్ శుక్లా కన్నుమూశాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపిన రవికిషన్.. ఇటీవలే ఆస్పత్రిలో చేరిన తనను కాపాడేందుకు వైద్యులు శ్రమించినా ఫలితం లేకుండా పోయిందన్నాడు. కానీ తండ్రిని కోల్పోయిన కొద్ది కాలానికే అన్నను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు. కాగా యూపీలోని గోరఖ్​పుర్​ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా రవికిషన్ ఉన్నారు.

Advertisement

Next Story