శారీలో సెక్సీ డ్యాన్స్.. కండిషన్స్ పెట్టక తప్పలేదన్న :Raveena

by Dishaweb |   ( Updated:2023-05-31 10:14:56.0  )
శారీలో సెక్సీ డ్యాన్స్.. కండిషన్స్ పెట్టక తప్పలేదన్న :Raveena
X

దిశ, సినిమా: సూపర్ హిట్ హిందీ సాంగ్ ‘టిప్ టిప్ బర్సా పానీ’షూటింగ్‌కు ముందు తాను పెట్టిన కండిషన్స్ గురించి ఓపెన్ అయింది రవీనా టాండన్. అక్షయ్ కుమార్ హీరోగా 1994లో వచ్చిన ‘మోహ్రా’ మూవీలోని ఈ పాటలో చీర కట్టుకుని అద్భుతంగా డ్యాన్స్ చేసిన నటి.. షూట్ టైమ్‌లో అందరూ చీర జారిపోతుందనే చాలెంజ్ చేసినట్లు చెప్పింది.

అయితే తాను మాత్రం చీర ఒక్క ఇంచు కూడా కదలదని, ఎన్ని రకాల స్టెప్పులేసిన ఒక మడతకూడా ఊడిపోదని సెట్‌లో అందరితో స్పష్టంగా చెప్పినట్లు గుర్తుచేసుకుంది. అలాగే ఇందులో ఎలాంటి ముద్దులు, మితిమీరిన హగ్గులు ఉండకూడదని షరతులు పెట్టినప్పటికీ పాటలో టిక్ మార్కుల కంటే చాలా క్రాస్ మార్కులు ఉన్నాయంటూ ఆసక్తికరంగా మాట్లాడింది. చివరగా ఇప్పటికీ జనాల నోళ్లలో ఈ పాట వింటుంటే హ్యాపీగా ఉందని చెప్పింది.

Read More.. ఓటీటీలో సందడి చేయనున్న ‘Ugram’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Advertisement

Next Story