- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి సమస్యతో బాధపడుతున్న రష్మిక.. రికవరీ చాలా ముఖ్యం అంటూ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మికను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఛలో సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అతి తక్కువ టైమ్‌లోనే స్టార్ డమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో నాలుగు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రష్మికకు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో ఇటీవల నెట్టింట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై చాలా మంది సినీ సెలబ్రిటీలు రష్మికకు మద్దతుగా నిలిచారు. అలా చేసిన వారిపై కూడా కేసులు నమోదు అయ్యాయి.
ఆ తర్వాత రష్మికకు సంబంధించిన మరో వీడియోను కొందరు వైరల్ చేశారు. ఇదిలా ఉంటే రష్మిక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ డీప్ ఫేక్ వీడియోపై కూడా స్పందించింది. తాజాగా, రష్మిక ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. గ్రీన్ కలర్ టీ షర్ట్ ధరించి బెడ్‌పై పడుకుని ఉన్న ఫొటోలు షేర్ చేసింది. అంతేకాకుండా ‘‘రికవరీ చాలా ముఖ్యం’’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు రష్మికకు ఏమైందని కంగారు పడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, రష్మిక వైరల్ ఫీవర్‌తో గత కొద్ది రోజుల నుంచి బాధపడుతుందట. ప్రస్తుతం ఆమె షూటింగ్‌లకు దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుంటుంది.