నేను అలా చేశానని మీకు ఎవరు చెప్పారు? ఆ రూమర్‌పై రష్మిక ఫైర్

by Hamsa |   ( Updated:2023-09-02 07:28:11.0  )
నేను అలా చేశానని మీకు ఎవరు చెప్పారు? ఆ రూమర్‌పై రష్మిక ఫైర్
X

దిశ, సినిమా: ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్‌ను బిజీగా గడుపుతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న.. తన నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించి నెట్టింట ప్రచారమవుతున్న ఓ వార్తపై స్పందించింది. ఈ మేరకు టాలీవుడ్ నటుడు నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో రష్మికను కథానాయికగా ఫైనల్ చేసినట్లు మేకర్స్ కూడా ప్రకటించారు.

తాజాగా, ఈ సినిమానుంచి రష్మిక తప్పుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. బాలీవుడ్‌ డేట్స్‌ సమస్యల కారణంగా ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకోనుందని సోషల్‌మీడియాలో రూమర్స్‌ వచ్చాయి. దీంతో వెంటనే రియాక్ట్ అయిన నటి.. ‘ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దీని గురించి అధికారికంగా మీకు ఎవరైనా సమాచారం ఇచ్చారా? అలాంటిదేమీ లేదు కాబట్టి ఆ వార్తలు ఖచ్చితంగా అబద్ధం అని నేను చెప్పగలను’ అని ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే పెళ్లిపై మాట్లాడుతూ ఇప్పట్లో అలాంటి ఆలోచనలు ఏమీ లేవని, ఇంకా చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story
null