- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ రష్మికకు రూ. 10 కోట్లు ఇచ్చింది.. అందుకే ఈ రాజకీయ ప్రచారం.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మికకు బీజేపీ రూ. 10 కోట్లు ఇవ్వడం వల్లే ఆమె పాజిటివ్‌గా ప్రచారం చేస్తుందని ఓ ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయానికి వస్తే.. ‘అభివృద్ధికి ఓటు వెయ్యండి’ అంటూ రష్మిక ఇటీవల ఓ పెట్టిన పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌పై ఆమె ప్రయాణిస్తూ.. ‘భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మనల్ని ఎవరూ ఆపలేరు. యువ భారత్ దేన్నయినా సాధించగలదు. దేశంలో మౌలిక వసతులు, రహదారి ప్రణాళిక అద్భుతంగా ఉన్నాయి. 22 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ హార్బర్ లింక్‌పై ప్రయాణం 2 గంటల సమయం నుంచి కేవలం 20 నిమిషాలకు తగ్గిస్తుంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. ‘ఖచ్చితంగా! ప్రజల జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైనది మరొకటి ఉండదు’ అంటూ రిప్లై ఇచ్చారు. ఇప్పుడు మోడీ ట్వీట్‌పై నేషనల్ క్రష్ రష్మిక స్పందించింది. ఈ మేరకు ‘సార్! ఎంత గౌరవం! ఎంతో గర్వించదగిన యువ భారతీయుడిగా మన దేశం ఎదుగుదలకు సాక్ష్యమివ్వడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం రష్మిక ట్వీట్ వైరల్ అవుతున్న క్రమంలోనే దీనిపై సినీ క్రిటిక్ ఉమైర్ స్పందించి ఓ ట్వీట్ పెట్టాడు. ‘#BJP రాజకీయ ప్రచారానికి #రష్మికమందన్నకు రూ. 10 కోట్లు చెల్లించారు. ఇది చాలా అవమానం కరం. అందుకే ఆమె వాళ్లకు సపోర్ట్‌గా ప్రచారం చేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉమైర్ ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్‌గా వైరల్ అవుతోంది.