లిప్ లాక్స్ లేవని పవర్ స్టార్ మూవీని రిజెక్ట్ చేసిన రష్మిక మందన్నా!

by Anjali |   ( Updated:2023-11-07 14:38:02.0  )
లిప్ లాక్స్ లేవని పవర్ స్టార్ మూవీని రిజెక్ట్ చేసిన రష్మిక మందన్నా!
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అవుతుందో స్పెషల్‌గా చెప్పుకోనవసరం లేదు. ఆ వీడియోపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించి సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ భామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ మిస్ చేసుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నివేదా థామస్, అంజలి, అనన్య ఫిమేల్ లీడ్ పాత్రలో నటించారు. ఈ సినిమా కంప్లీట్‌గా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కావడంతో ఎలాంటి రొమాంటిక్ బోల్డ్ సీన్స్ ఉండవు.

ఇక అప్పుడే స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంటున్న రష్మికకు నివేదా థామస్ ప్లేస్‌లో నటించే అవకాశం వచ్చింది. కానీ, ఇలాంటి పాత్రలు చేస్తే గ్లామరస్ బ్యూటీగా ఇక ఇండస్ట్రీలో ఉండనేమో అని రష్మిక ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట. ‘‘పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? అలాంటిది రష్మిక మిస్ చేసుకున్నారంటే అందులో లిప్ లాక్ సీన్స్, బోల్డ్ సీన్స్ లేవనే నటించలేదు అనుకుంటా? అలాంటి హీరోయిన్ ఇంత పద్ధతిగా ఎలా నటించగలదు’’ అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ వెటకారంగా కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed