రష్మిక చేతుల మీదుగా.. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ఐ.డి, హెల్త్ కార్డుల పంపిణీ

by sudharani |   ( Updated:2023-07-18 08:26:39.0  )
రష్మిక చేతుల మీదుగా.. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ఐ.డి, హెల్త్ కార్డుల పంపిణీ
X

దిశ, సినిమా: తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(TFJA) తమ సంఘ సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుంది. ఈ సంఘ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల బాగోగులు చూస్తూ ప్రతి సంఘ సభ్యుడికీ ఇంటి పెద్దగా అండగా నిలుస్తూ వస్తోంది టిఎఫ్‌జేఏ. ఇందులో చేరిన ప్రతి సభ్యుడి కుటుంబానికి మూడు లక్షల ఆరోగ్య బీమా సౌకర్యంతో పాటు, టర్మ్ పాలసీ, యాక్సిడెంటల్ పాలసీని ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం పరిశ్రమ సహాయ సహకారాలతో పాటు అందరు సభ్యుల తోడ్పాటును తీసుకుంటోంది. దీని ప్రకారం తాజాగా ఈ ఏడాది (2023 మార్చి 2024 మార్చి) వరకు సభ్యత్వం తీసుకున్న వారికి రష్మిక చేతుల మీదుగా గుర్తింపు కార్డుతో పాటు, హెల్త్ కార్డును అందించడం జరిగింది.

ఇందులో భాగంగా TFJA అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన నిర్మాతలు, రష్మిక మందన్నా గారికి ధన్యవాదాలు. మేము అడగ్గానే మాకు సహాయ సహకారాలు అందించిన దిల్ రాజు గారికి కృతజ్ఞతలు. ఆయన సంవత్సరం పాటు మాకు ఇన్సూరెన్స్‌కు అవసరమైన మొత్తాన్ని ఇస్తామని చెప్పారు. మా మిత్రుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చి 40 రోజుల పాటు కోమాలో ఉన్నారు. మరో ఇద్దరు ముగ్గురు మిత్రులు యాక్సిడెంట్ కారణంగా చాలా రోజుల పాటు నడవలేని స్థితికి వెళ్లారు. ఆ సమయంలో వారి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడ్డాయి. ఈ ముగ్గురు నలుగురికి కలిగిన సమస్యలు బేస్ చేసుకుని ఈ సంఘంగా ఏర్పడింది.

ఒకరికొకరు సహాయం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఫలితమే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ఇన్సూరెన్స్ గురించి తెలిసి చిరంజీవిగారు అడగకుండానే మాకు సహాయం చేశారు. కరోనా టైమ్‌లో చాలా మందికి మా సంఘం ద్వారా సాయం చేశాం. వీటితో పాటు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం. ఇక ఈ ఇన్సూరెన్స్ గురించి ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లకూడదనుకున్నాం. వారు మైత్రీ మూవీ మేకర్స్ వరకు వచ్చి అడగాల్సిన పనిలేదు. ఈ యేడాదికి ఎంత అవుతుంది చెప్పండి మీ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేస్తాం అంటున్నారు. చాలా సంతోషం’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read More: డాక్టర్‌తో ప్రేమలో పడ్డ శ్రీలీల.. పెళ్లికి కూడా తల్లి గ్రీన్ సిగ్నల్!

Advertisement

Next Story