Rashmika : షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో ఆ పని చేసిన రష్మిక.. గ్రేట్ అంటున్న ఫ్యాన్స్!

by Jakkula Samataha |
Rashmika : షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో ఆ పని చేసిన రష్మిక.. గ్రేట్ అంటున్న ఫ్యాన్స్!
X

దిశ, సినిమా : రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఇక ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ గీతా గోవిందంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడంతో, ప్రతి సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ, టాలీవుడ్, బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్‌తో చాలా బిజీ అయిపోయింది. ముఖ్యంగా ఈ నటి పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్‌ల్లో మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?

హీరోయిన్స్ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌కు వెళ్లడం కామన్. అయితే తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లడంతో ఆమెపై తన ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో దీంతో రష్మిక తన అభిమానుల కోసం కారులో నుంచి నిలుచుని వారికి స్పెషల్‌గా హాయి చెప్పింది. అంతే కాకుండా ఫ్లయింగ్ కిస్ ఇస్తూ తన అభిమానులు సంతోష పడేలా చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక అభిమానుల కోసం ప్రత్యేకంగా కారులో నుంచి లేచి పలకరించడంతో రష్మికను గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు నెటిజన్స్.

Advertisement

Next Story

Most Viewed