అడ్డంగా దొరికిపోయినా రష్మిక, విజయ్..వీరి రిలేషన్‌పై మళ్లీ మొదలైన చర్చ!

by Jakkula Samataha |   ( Updated:2024-03-12 09:43:28.0  )
అడ్డంగా దొరికిపోయినా రష్మిక, విజయ్..వీరి రిలేషన్‌పై మళ్లీ మొదలైన చర్చ!
X

దిశ, సినిమా : నేషనల్ క్రష్ రష్మిక మందన, విజయ్ దేవరకొండల గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త ఎప్పుడూ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటుంది.గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ జంట.. ఆ మూవీతోనే ప్రేమలో పడ్డట్టు గుస గుసలు వినిపించాయి. ఇక వీరు ప్రేమలో ఉన్నారు. సీక్రెట్‌గా వెకేషన్స్ ఎంజాయ్ చేసినట్లు అంతే కాకుండా రెస్టారెంట్‌లో ఇద్దరూ కలిసినట్లు ఇలా ఎన్నో రూమర్స్ వీరి గురించి పుట్టుకొస్తున్నాయి. అలాగే వీరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతుంటాయి. కాగా, వీటిని అటు రష్మిక, ఇటు రౌడీ హీరో కొట్టిపారేస్తూ మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని చెప్పుకొస్తున్నారు. అయినా రూమర్స్ ఆగడం లేదు.

మరోసారి వీరికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. రష్మిక ,విజయ్ మరోసారి అడ్డంగా దొరికి పోయారంటూ వీరికి సంబంధించిన ఫొటోల ను షేర్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే..కొద్దిరోజుల కిందట విజయ్ దేవరకొండ తన బ్రాండ్ రౌడీ వేర్ను ప్రమోట్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో అతను ఒక బేబీ పింక్ కలర్ లో ఉండే క్యాప్ను పెట్టుకొని కనిపించాడు. ఇక రీసెంట్‌గా ఉమెన్స్ డే సందర్భంగా మన నేషనల్ క్రష్ కూడా తన ఇన్ స్టాలో పెట్టిన పోస్టులో అది పింక్ క్యాప్ ధరించి కనిపించింది. దీంతో ఇద్దరు సేమ్ టు సేమ్ క్యాప్ పెట్టుకున్నారేంటబ్బా అన్న చర్చ మొదలైంది.వీరు ప్రేమలో లేమని చెబుతున్నారు కానీ వీరు లవ్‌లో ఉన్నారు.. పాపం ఇలా అడ్డంగా దొరికిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోస్‌తో మరోసారి వీరి లవ్ ట్రాక్ నెట్టింట చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story