- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంటే సోషల్ మీడియాలో అమ్మాయిలను దాక్కోమంటున్నారా.. రష్మి ట్వీట్ వైరల్
దిశ, సినిమా: హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ‘జబర్దస్త్’ షోతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత దగ్గరైంది. వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం చేతి నిండా షోలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటుంది. అయితే తాజాగా ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఒక నెటిజన్ ‘ఇప్పుడున్న ఈ ఫాస్ట్ డిజిటల్ మీడియాలో సురక్షితంగా బతకడం కష్టంగా మారింది.
అమ్మాయిలందరు తమ సోషల్ మీడియా ఖాతాను ప్రైవేట్ చేసుకోండి. డీపీలో మీ ఫోటో ఉంటే తీసేయండి. తెలియని వారితో మీ పిక్స్ పంచుకోవద్దు. కొందరు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి అసభ్యకరమైన ఫొటోలను క్రియేట్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి’ అని రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్‌పై స్పందించిన రష్మి.. ‘ఇలా అసభ్యకరమైన ఫొటోలు క్రియేట్ చేసే వారికి చిక్కకుండా అమ్మాయిలను దాక్కోమని చెప్పే బదులు ఇలాంటి నేరాలపై అవగాహన కల్పించడం అవసరం. కనిపించేదంత నిజం కాదని తెలిసేలా చేద్దాం’ అంటూ రాసుకొచ్చింది.
Read more: