- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి భర్తే కావాలి.. కియారా భర్త విషయంలో రాశిఖన్నా షాకింగ్ కామెంట్స్!
దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ తర్వాత వరుసగా ఆఫర్స్ రావడంతో స్టార్ హీరోల అందరి సరసన నటించింది. కానీ ఈ అమ్మడుకు తెలుగులో అంతగా ఎదగలేక పోయింది.సినిమా హిట్ అయినా రాశిఖన్నాకు అంతగా హైప్ రాలేదు, తర్వాత మెల్లి మెల్లిగా ఆఫర్స్ రావడం కూడా తగ్గింది. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్‌కు చెక్కేసింది.
ఇక ఈ బ్యూటీ యోధ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ జంటను ఆన్ స్క్రీన్‌పై చూసిన నెటిజన్స్, వీరి కెమిస్ట్రీకి పడిపోయారు. దీంతో సిద్ధార్థ్ ఫ్యాన్, కియారా బదులు రాశిని పెళ్లి చేసుకుంటే బాగుండేదని ముచ్చటిస్తున్నారు. కాగా, తాజాగా సిద్ధార్థ్ గురించి రాశి ఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ..మేము కలిసుంటే బాగుండని ఫ్యాన్స్ తెగ ముచ్చట పడతారు. కానీ స్క్రీన్‌పై జంటగా చూడటానికి బాగున్నంత మాత్రాన నిజ జీవితంలో కూడా అలానే ఉంటారనే మనం చెప్పలేం కదా. అయినా నాకు చిన్నపిల్లాడిలా, పరిపక్వత లేకుండా ప్రవర్తించేవారు అసలు నచ్చే నచ్చరు. పెద్దవారు పిల్లల వేషాలు వేస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. బాధ్యతగా ఉంటూ, మెచ్యూర్‌గా వ్యవహరిస్తే బాగుంటారు. నేను అలాంటి భర్తనే కోరుకుంటున్నాను అని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Read More..
ఆ కారణంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
- Tags
- Rashi Khanna