పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. వరుడు అతడేనంట?

by samatah |   ( Updated:2023-08-11 06:27:14.0  )
పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. వరుడు అతడేనంట?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశిఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది.

ఇక ఈ మధ్య ఈ అమ్మడు తాను ఒక అబ్బాయిని ప్రేమించి బ్రేకప్ అయ్యానని, తర్వాత డిప్రెషన్కు వెళ్లడంతో బరువు పెరిగానని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా కొద్ది రోజులకే మరో వ్యక్తి పరిచయం అయ్యాడని, అతని పరిచయం ప్రేమగా మారింది. మేము ఇద్దరం డేటింగ్‌లో ఉన్నాం దీంతో నేను బరువు తగ్గి ఎప్పటిలా అయ్యాను అంటూ తెలిపింది.

ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. అయితే రాశిఖన్నా తాను డేటింగ్ చేస్తున్న వ్యక్తినే త్వరలో పెళ్లి చేసుకోనుదట. ఈ విషయాన్ని తన ఇంట్లో వాళ్లకు చెప్పడంతో వారు ఒప్పుకున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతంది. ఇక త్వరలో బ్యూటీ గుడ్ న్యూస్ చెప్పనుంది అంటూ తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Read More : ఆ సమయంలో ఎంజాయ్ చేయలేకపోతున్నారా?.. మీ ఆలోచన మార్చుకోండి !

Advertisement

Next Story