- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ప్రేక్షకులకు మెప్పించే బాధ్యత నాది.. రణ్‌వీర్‌పై ట్రోలింగ్‌ను తిప్పికొట్టిన డైరెక్టర్
దిశ, సినిమా: సూపర్ హిట్ ‘డాన్’ సిరీస్‌కు భారీ సంఖ్యలో ప్రేక్షకులున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సిరీస్‌ను కొనసాగిస్తూ రణ్‌వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ‘డాన్ 3’ని తెరకెక్కిస్తు్న్నట్లు ఇటీవలే ప్రకటించాడు. అంతేకాదు ఈ మూవీ అప్‌డేట్‌లో భాగంగా రణ్‌వీర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. అయితే రణ్‌వీర్‌ను సెలక్ట్ చేయడంపై విమర్శలు రావడంతో తాజాగా స్పందించిన ఆయన.. ‘అప్పట్లో ‘డాన్2’ ప్రకటించినపుడు ఇలాగే జరిగింది. అమితాబ్‌ను కాదని షారుఖ్‌ను ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. కానీ ఆ మూవీ రిలీజ్ అయ్యాక బాద్‌షా నిజమైన డాన్‌లా కనిపించాడని ప్రశంసించారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. రణ్‌వీర్‌పై ట్రోలింగ్ సరైనది కాదు. ఆయన అద్భతమైన వ్యక్తి, నటుడు. ‘డాన్ 3’లో నటించడం గురించి అతను ఉత్సాహంగా ఉన్నాడు. ప్రేక్షకులకు నచ్చేలా స్క్రిప్ట్ రాసే బాధ్యత నాది. ఏది ఏమైనా ఈసారి ఆడియన్స్ కొత్త డాన్‌ను చూస్తారు’ అని చెప్పాడు. చివరగా షూటింగ్ 2025లో మొదలవుతుందనే చర్చపై మాట్లాడుతూ ఇంకా నటీనటుల సెలక్షన్ పూర్తి కాలేదని తెలిపాడు.
Read More: Sonam Kapoor : రానాకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సోనమ్ కపూర్?