శ్రీముఖిని ముద్దులతో తడిపేసిన రణవీర్ సింగ్ (వీడియో)

by sudharani |   ( Updated:2023-08-18 15:13:53.0  )
శ్రీముఖిని ముద్దులతో తడిపేసిన రణవీర్ సింగ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగులో స్టార్ యాంకర్‌గా రాణిస్తున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పటాస్‌ షోలో రాములమ్మ స్టెప్‌తో పాపులారిటీ దక్కించుకున్న ఈ భామ ఇప్పుడు వరుస షోలతో బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే ''సైమా2022''లో శ్రీముఖి, కమెడియన్ అలీతో కలిసి యాంకర్‌గా చేసింది. అయితే, సౌత్ ఇండియన్ మూవీలకు సంబంధించిన అవార్డు ఫంక్షన్‌లో శ్రీముఖి బ్లాక్ ట్రెండీ వేర్‌లో మెస్మరైజ్ చేస్తూ హైలైట్‌గా నిలిచింది.

ఇక అవార్డు ఇచ్చేందుకు స్టేజ్‌పైకి వచ్చిన రణవీర్ సింగ్‌ని శ్రీముఖి దగ్గరకు పిలుచుకుంది. అమ్మాయిలందరూ జెలసీ పడేలా మీకు ఏదో ఒకటి చేయాలని రణ్‌వీర్‌ను కోరింది. దీంతో రెచ్చిపోయిన రణ్‌వీర్ శ్రీముఖికి హగ్‌లు ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఆమె రెండు చేతులు పెట్టుకుని ముద్దులు పెట్టడం విశేషం. ఈ సీన్‌తో ఉబ్బితబ్బిబ్బయ్యింది శ్రీముఖి. ఈ సందర్భంగా దీపికా పదుకొనెమ్మా చూస్తున్నావా? అంటూ అలీ వేసిన పంచ్‌లు అక్కడ నవ్వులు పూయించాయి. కాగా, శ్రీముఖి ఈ వీడియోను తన ఇస్టాగ్రామ్‌లో షేర్ చేయాగా.. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.

Advertisement

Next Story