సుమన్‌ చేతుల మీదుగా విడుదలైన ‘రంగస్వామి’ ట్రైలర్

by Harish |
సుమన్‌ చేతుల మీదుగా విడుదలైన ‘రంగస్వామి’ ట్రైలర్
X

దిశ, సినిమా: నరసింహాచారి, డా. సకారం మారుతి, భాస్కర్‌రెడ్డి, చిత్రం శ్రీను, మీనాక్షిరెడ్డి, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘రంగస్వామి’. డ్రీమ్‌ సినిమా పతాకంపై స్వీయ దర్శకనిర్మాణంలో నరసింహాచారి తెరకెక్కిస్తున్న సినిమా ట్రైలర్‌ను తాజాగా సీనియర్ నటుడు సుమన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘యువత డ్రగ్స్‌ ఉపయోగించినప్పుడు ఎంత ఆనందిస్తున్నారో.. ఆతర్వాత అంతకు మించి ఇబ్బందులు ఎదుర్కొవడాన్ని ఇందులో చక్కగా చూపించారు. ట్రైలర్‌ చూశాక చాలా రోజుల తర్వాత చక్కని సందేశంతో కూడిన థ్రిల్లర్‌ చూసిన భావన కలిగింది. ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదనిపించింది. ఈ చిత్రంలో ఎమోషన్స్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. తండ్రీ కొడుకుల మధ్య చక్కని భావోద్వేగాలున్నాయి. సినిమా చూశాక మైండ్‌ ఫ్రెష్‌ అయినట్లు అనిపించింది. ఇలాంటి కథలు రావడం చాలా ఈ సమాజానికి అవసరం’ అని అన్నాడు.

Advertisement

Next Story