- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ranbir Kapoor: కుమార్తె కోసం సంచలన నిర్ణయం తీసుకున్న రణబీర్ కపూర్
దిశ, ఫీచర్స్: బాలీవుడ్ అగ్ర హీరో రణబీర్ కపూర్ ఇటీవలే యానిమల్ చిత్రంతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ఇందులో రణబీర్ భార్యగా ఎంతో చక్కగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇకపోతే రణబీర్ అండ్ అలియా భట్ ప్రేమ వివాహం చేసుకొన్న విషయం తెలిసిందే. వీరికి ‘రాహా’ అనే క్యూట్ పాప జన్మించింది. ఈ బుజ్జాయి కోసం రణబీర్ కపూర్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ హీరోకు కొన్నేళ్లుగా ఉన్న అలవాటును ప్రస్తుతం తన కుమార్తె కోసం వదులుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
17 ఏళ్ల వయసు నుంచి తాను సిగరెట్ తాగుతున్నానని వెల్లడించాడు. కాగా ఇప్పుడు నాకు రాహా ఆరోగ్యం ముఖ్యమని తెలిపాడు. దీంతో రాహా హెల్తీగా ఉండేందుకు ధూమపానాన్ని పూర్తిగా మానేస్తున్నానని పేర్కొన్నాడు. తన కుమార్తె జన్మించాక, రణబీర్ మళ్లీ పుట్టానని అన్నారు. తండ్రిగా తాను కూడా హెల్తీగా ఉండాలని రణబీర్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. గతంలో కూడా ఈ హీరో కుమార్తెతో టైమ్ స్పెండ్ చేయడం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాహా పుట్టినప్పటి నుంచి సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నందున తనతో గడపలేకపోయాని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.