ఆ కారణంతోనే మా బిడ్డను కెమెరా కంటపడనివ్వట్లేదు : స్టార్ కపుల్స్

by Prasanna |   ( Updated:2023-01-08 07:07:01.0  )
ఆ కారణంతోనే మా బిడ్డను కెమెరా కంటపడనివ్వట్లేదు : స్టార్ కపుల్స్
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ క్రేజీ కపుల్స్‌ రణబీర్ కపూర్- అలియా భట్ తమ కూతురిని కెమెరా కంటపడకుండా దాచడంపై స్పందించారు. ఈ మేరకు 'రాహా' అనే తమ గారాలపట్టి ఫేస్ కొంతకాలం ఎవరికీ కనిపించకుండా గోప్యంగా ఉంచాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. ఎందుకంటే చిన్నతనంలోనే తాను సోషల్ మీడియా వేదికల్లో ఓ చర్చనీయాంశమవడం తమకు ఇష్టంలేదని చెబుతూ తాజాగా ఫొటోగ్రాఫర్లను కలిసిన రిక్వెస్ట్ చేశారు. అంతేకాదు ఎక్కడ కనిపించినా తమ బిడ్డ ఫొటోలు తీయొద్దని అభ్యర్థించారు. తనకి సరైన వయస్సు వచ్చినపుడు మాత్రమే ఫొటోలను తీసుకోడానికి అనుమతిస్తామని, అప్పటిదాకా ప్రొఫెషనల్స్, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ తమకు సహకరించాలని కోరారు. ఇక రణ్‌బీర్ ప్రస్తుతం 'యానిమల్'తో కొన్ని సినిమాల్లో నటిస్తుండగా ఆలియా 'రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని'తో పాటు 'హార్ట్ ఆఫ్ స్టోన్' అనే హాలీవుడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురానుంది.

Also Read..

" Waltair Veerayya " ట్రైలర్ అదుర్స్

Advertisement

Next Story