- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ranasthali Movie Review : క్లైమాక్స్ ట్విస్ట్‌కు మాస్ ఆడియన్స్ ఫిదా
దిశ, సినిమా: ధర్మ, అమ్ము అభిరామి, చాందిని రావు హీరో హీరోయిన్లుగా పరశురామ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రణస్థలి'. సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్స్ పతాకంపై అనుపమ సురెడ్డి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే టీజర్, ట్రైలర్‌తో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నేడు(శనివారం) ప్రేక్షకుల ముందుకొచ్చిన 'రణస్థలి' ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..
కథ :
బసవ(ధర్మ), అమ్ములు(చాందినీ రావు) బావా మరదళ్లు. అమ్ములు చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో బసవ ఇంట్లోనే పెరుగుతుంది. బసవ తండ్రి మున్నియ్య(సమ్మెట గాంధీ) వీరిద్దరికీ పెళ్లి చేస్తాడు. ఆర్నెళ్లలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాల్సిన బసవ.. అప్పటి వరకు ఖాళీగా ఉండటం ఎందుకని చేసిన అప్పు తీర్చడం కోసం ఏదో ఒక పని చేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే చక్రవర్తి(బెనర్జీ) అనే పెద్దమనిషి వద్ద పనికి చేరతాడు. ఒకరోజు అక్కడి తోటలో పనిచేసేందుకు వచ్చిన నలుగురు పనివాళ్లకు బస ఏర్పాటు చేయమని చక్రవర్తి.. బసవ, అమ్ములుకి చెబుతాడు. అయితే, వచ్చింది పనివాళ్లు కాదు మర్డర్లు చేసే కిరాయి గుండాలని బసవకి తెలిసేలోపే.. చక్రవర్తిని, అమ్ములును చంపేస్తారు? అసలు ఆ గుండాలు వాళ్లిద్దరినీ ఎందుకు చంపేశారు. ఇంతకీ వాళ్లను పంపించింది ఎవరు? అనేది తెరపై చూడాల్సిందే.
నటీనటుల పనితీరు : బసవ పాత్రలో ధర్మ అదరగొట్టాడు. యాక్షన్ సన్నివేశాల్లో హై లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక అమ్ములు పాత్ర పోషించిన చాందినీ రావు పరిధి మేర చక్కగా నటించింది. అమ్ము అభిరామి కూడా సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. మరోవైపు సమ్మెట గాంధీ హీరో తండ్రి పాత్రలో జీవించేశాడు. విలన్‌గా చేసిన శివ కూడా టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్‌తో ఆకట్టుకున్నాడు. బెనర్జీ, చంద్ర శేఖర్, మధు మణి, శ్రీనివాస్ వెట్టి, ప్రశాంత్ పండు తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు : దర్శకుడు పరశురామ్ శ్రీనివాస్ తాను అనుకున్న పాయింట్‌ను ఎంగేజింగ్‌గా యాక్షన్ ఎపిసోడ్స్‌తో ప్రజెంట్ చేయడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా క్లైమాక్స్ తీర్చిదిద్దిన విధానానికి అందరూ ఫిదా అయిపోవడం ఖాయం. హీరో ఫ్రెండ్ కిడ్నాప్ ఎపిసోడ్ చూస్తే ఇతని దర్శకత్వ ప్రతిభ ఏంటనేది అర్ధమవుతుంది. థియేటర్లలో ఈ సీన్‌కు విజిల్స్ పడటం ఖాయం అనే చెప్పాలి. అలాగే లాస్ట్‌లో వచ్చే ట్విస్ట్‌లు కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమాకు క్లైమాక్స్ ప్రాణం అని చెప్పుకోవచ్చు. స్క్రీన్‌ప్లే కూడా ఎక్కడా బోర్ కొట్టదు. దర్శకుడు తర్వాత ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. కెమెరామెన్ జాస్టి బాలాజీ కూడా మంచి అవుట్‌పుట్ ఇచ్చాడు. కేశవ్ కిరణ్ సంగీతంలో పరశురాం శ్రీనివాస్ వ్రాసిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతమనే చెప్పాలి. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాను తెరకెక్కించారు.
విశ్లేషణ : మాస్ ఆడియన్స్‌ను యాక్షన్ ప్రియులను తప్పకుండా అలరించే రా అండ్ రస్టిక్ మూవీ ఇది. ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి.. అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పకుండా చూడదగ్గ సినిమా అని కూడా చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ కోసం తప్పకుండా థియేటర్లలో చూడదగ్గ సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
రేటింగ్ : 3.5/౫
READ MORE
Pavitra Lokesh :ఫొటోలు మార్ఫింగ్ చేసి.. కామెంట్స్ చేస్తున్నారు: పోలీసులకు ఫిర్యాదు