Rana Daggubati: గుండెల్ని దోచేశాడు పో.. హీరో రానా దగ్గుబాటి చేసిన పనికి అభిమానులు ఫిదా!

by Javid Pasha |
Rana Daggubati: గుండెల్ని దోచేశాడు పో.. హీరో రానా దగ్గుబాటి చేసిన పనికి అభిమానులు ఫిదా!
X

దిశ, సినిమా : యంగ్ అండ్ డైనమిక్ హీరో రానా దగ్గుబాటి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. రొటీన్‌కు భిన్నంగా సినిమాల్లో హుందాతనంతో కూడిన క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫేమ్ సంపాదించుకున్నాడు. ఇక 2022లో రిలీజైన విరాట పర్వం మూవీ తర్వాత వెండితెరపై కనిపించలేదు కానీ.. తన బాబాయి వెంకటేష్‌తో కలిసి ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లో, తర్వాత నిఖిల్ నటించిన స్పై మూవీలో కనిపించి అలరించాడు. అప్పటి నుంచి మూవీస్‌లో హీరోకంటే.. ప్రొడ్యూసర్‌గానే బిజీ అయపోయాడు రానా.

ప్రజెంట్ రానా దగ్గుబాటి ఏ మూవీలోనూ నటించడం లేదు. కాకపోతే నిర్మాతగా మూవీస్‌ను ప్రమోట్ చేస్తున్నాడు. సినిమాల విషయం పక్కన పెడితే.. రానా దగ్గుబాటి వ్యక్తిగతంగా చాలా మంచివాడని, సరదా సరదాగా ఉంటాడని చెప్తుంటారు అతని ఫ్యాన్స్ అండ్ తోటి నటీ నటులు. ఈ క్రమంలోనే అందుకు అద్దంపట్టే మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన వారంతా రానా మరోసారి అభిమానుల గుండెల్ని దోచేశాడు పో.. అంటున్నారు.

వైరల్ వీడియో ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ప్రజెంట్ రానా అమెరికా వెకేషనన్‌లో ఉన్నాడు. అక్కడి అందమైన ప్రదేశాలను తిలకిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను చికాగోలో కారులో వెళ్తుండగా.. అంతలోనే ఓ అభిమాని కూడా తన కుటుంబంతో కలిసి కారులో వెళ్తూ రానాను చూశాడు. ఒక్కసారిగా ఆనందంతో పొంగిపోయిన ఆ అభిమాని రానాకు హాయ్ చెప్పగా.. వెంటనే రానా కూడా రెస్పాండ్ అయ్యాడు. పరస్పరం పలకరించుకున్నారు. కాగా తనకు ఆటో గ్రాఫ్ కావాలని అభిమాని కోరగా.. కారును సైడ్‌కు ఆపి మరీ అభిమానికి, అతని కుటుంబానికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు రానా దగ్గుబాటి. ఈ సందర్భంగా రానాను గట్టిగా హగ్ చేసుకొని భావోద్వేగానికి లోనయ్యాడు అభిమాని. తన షర్ట్‌పై ఎడమవైపు గుండె భాగంలో ఆటోగ్రాఫ్ చేయించుకున్నాడు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతోపాటు రానాతో కలిసి పొటోలు దిగాడు సదరు అభిమాని. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అభిమానుల గుండెల్ని దోచేశావ్ పో అంటూ.. రానా దగ్గుబాటిని అందరూ మెచ్చుకుంటున్నారు. రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

video credits to Ranadaggubatif insta Id

Advertisement

Next Story

Most Viewed