Maruti Nagar Subramaniam: తన క్యారెక్టర్ రివీల్ చేసిన రమ్య పసుపులేటి.. ఆసక్తికర కామెంట్స్ వైరల్

by Hamsa |   ( Updated:2024-08-19 14:28:33.0  )
Maruti Nagar Subramaniam: తన క్యారెక్టర్ రివీల్ చేసిన రమ్య పసుపులేటి.. ఆసక్తికర కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: రావు రమేష్, ఇంద్రజ జంటగా నటించిన సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఇందులో రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య, అతని సరసన రమ్య పసుపులేటి నటించారు. పీవీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో ఈ శుక్రవారం సినిమా విడుదల అవుతుంది. ఈ సందర్భంగా రమ్య పసుపులేటి మీడియాతో మాట్లాడారు. ‘‘నాకు నాలుగైదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి యాడ్స్ చేస్తున్నాను. అనుష్క పంచాక్షరీలో బాలనటిగా చేశా.

సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ లోనూ ఓ రోల్ చేసి ఆ తర్వాత చదువుకోవాలని గ్యాప్ తీసుకున్నాను. బ్యాచిలర్స్ ఫినిష్ చేసి సినిమాల్లోకి వచ్చాను. ప్రజలకు రీచ్ అవ్వడానికి ఇన్‌స్టాగ్రామ్‌ హెల్ప్ అయ్యింది. 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'లో అవకాశం ఎలా వచ్చిందంటే.. దర్శకుడు లక్ష్మణ్ కార్య నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశారట. ఈ అమ్మాయిని పిలవండి, ఆడిషన్ చేద్దామని టీమ్ మెంబర్స్‌తో చెప్పారట. ఆఫీసుకు వెళ్ళాక ఆడిషన్ చేసి నా పెర్ఫార్మన్స్ నచ్చడంతో ఎంపిక చేశారు. చాలా రోజుల తర్వాత మంచి అవకాశం రావడంతో హ్యాపీగా ఫీలయ్యాను.ప్రేక్షకులను నవ్వించగలిగితే క్యారెక్టర్ పండినట్టు. ఇందులో నా పాత్ర ద్వారా నవ్వించే అవకాశం వచ్చింది. సినిమా చూసిన వారందరికీ నా రోల్ నచ్చుతుంది’’ అని చెప్పుకొచ్చింది.

Read More..

Raj Tarun: సినిమాల్లో హీరో.. బయట జీరో అసలు మ్యాటరే లేదంటున్న సంయుక్త సంచలనంగా మారిన వీడియో

Advertisement

Next Story