Ram Charan Game Changer: రామ్‌చరణ్‌కు గాయం.. షూటింగ్‌కు బ్రేక్!

by Hamsa |   ( Updated:2023-09-25 06:03:28.0  )
Ram Charan Game Changer: రామ్‌చరణ్‌కు గాయం.. షూటింగ్‌కు బ్రేక్!
X

దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే దీనిని దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

తాజాగా, గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా షూటింగ్ వాయిదా పడినట్లు తెలిపారు. ‘‘కొందరు నటీనటులు అందుబాటులో లేకపోవడంతో షూటింగ్‌ను వాయిదావేయాల్సివచ్చింది. అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తాము’’ అని ప్రకటించింది. తాజాగా, అందుతున్న సమాచారం.. షూటింగ్ వాయిదా పడటానికి అసలు కారణం నటీనటులు అందుబాటులో లేకపోవడం కాదని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో రామ్ చరణ్ ముఖానికి దెబ్బతగిలిందట. పది రోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. రామ్‌చరణ్ గాయం కారణంగా ఆదివారం నుంచి మొదలుకావాల్సిన గేమ్‌ఛేంజర్ కొత్త షెడ్యూల్‌ను పోస్ట్‌పోన్ అయినట్లు పలు వార్తలు వస్తున్నాయి. గాయం నుంచి రామ్‌చరణ్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆక్టోబర్ 6 నుంచి హైదరాబాద్‌లో నెక్స్ట్ షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నట్టు టాక్.

Advertisement

Next Story