‘జై ఎన్టీఆర్’.. నందమూరి అభిమానుల హృదయాలు గెలుచుకున్న Ram Charan !

by Anjali |   ( Updated:2023-05-21 06:30:55.0  )
‘జై ఎన్టీఆర్’.. నందమూరి అభిమానుల హృదయాలు గెలుచుకున్న Ram Charan !
X

దిశ, సినిమా: తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు శనివారం అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబీకులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అలాగే టాలీవుడ్ నుంచి ఎందరో ప్రముఖులతోపాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యాడు. ఈ వేదికపై చరణ్ చాలా గొప్పగా మాట్లాడాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ చరణ్ పట్ల మరింత ప్రేమ చూపిస్తూ ప్రశంసలు కురిపించారు. అయితే ఈ వేడకకు తారక్‌ను పిలిచినప్పటికీ తన బర్త్ డే కూడా ఇదే రోజుకావడంతో రాలేకపోయాడట. దీంతో ఈ ఉత్సవాల్లో తారక్ మిస్సయినా కానీ, తన స్నేహితుడైన రామ్ చరణ్ ఎన్టీఆర్ రాలేని లోటును భర్తీ చేశాడంటూ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఇక ‘జై ఎన్టీఆర్’ అంటూ తన స్పీచ్ ముగించిన చెర్రీ అందరి హృదయాలను గెలుచుకున్నాడు.

Read more:

సింహాద్రి రీరిలీజ్.. ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

Advertisement

Next Story