ఆకట్టుకుంటున్న 'AP04 రామాపురం' ట్రైలర్

by sudharani |   ( Updated:2023-12-13 12:01:10.0  )
ఆకట్టుకుంటున్న AP04 రామాపురం ట్రైలర్
X

దిశ, సినిమా : రామ్ జక్కల, అఖిల ఆకర్షణ, పి.ఎన్ రాజ్, సునీల్ మల్లెం ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'AP04 రామాపురం'. ఆర్ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్‌వీ శివా రెడ్డి సమర్పణలో రామ్ రెడ్డి అందూరి నిర్మించిన చిత్రానికి హేమ రెడ్డి దర్శత్వం వహించారు. కాగా ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నందు, సోహైల్, జెస్సీ‌, పృథ్వి మాట్లాడుతూ.. టైటిల్ చాలా క్యాచీగా ఉందని, ట్రైలర్ అమితంగా ఆకట్టుకుంటోందని చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక 19 ఏళ్లకు రాయడం మొదలుపెట్టి, 23 ఏళ్లకు డైరెక్టర్ అయ్యానన్న హేమ రెడ్డి.. తమ సినిమాను ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షకులు, ప్రింట్ మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. కాగా డిసెంబర్ 9న రిలీజ్ అవుతున్న చిత్రానికి సాకేత్ వేగి & అబు సంగీతం అందించారు.

READ MORE

పంచతంత్రం ట్రైలర్ : ఒకే సినిమాలో ఐదు కథలు

Advertisement

Next Story