పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ సంచలన పోస్ట్..ఆ సింబల్‌తో షాకిచ్చాడుగా..

by Jakkula Samataha |
పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ సంచలన పోస్ట్..ఆ సింబల్‌తో షాకిచ్చాడుగా..
X

దిశ, సినిమా : పిఠాపురం నియోజక వర్గంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యధిక భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో అటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఇటు ఫ్యాన్స్ అందరూ చాలా సంతోషంతో ట్వీట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈక్రమంలోనే పవన్ కళ్యాణ్‌పై ఆర్జీవీ ట్వీట్ చేశారు.

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో ఆయన వార్తల్లో నిలుస్తుంటారు. ఇక ఆయన ఏదైనా ట్వీట్ చేసాడంటే ఎవరినో, ఒకరిని టార్గెట్ చేసినట్లే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను ఆర్జీవీ ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటాడు. కానీ మొదటి సారి ఆయన పవన్ కళ్యాణ్‌పై ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయలేదు. ఆయన తన ట్వీట్‌లో ఎలాంటి కామెంట్ చేయకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ పేరు రాసి దండం సింబల్స్ పెట్టేశారు. అయితే దీనికి అర్థం నువ్వు గొప్పోడివి అన్నట్లు. అలా ఆయన మొదటి సారి సానుకూలంగా స్పందించడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక ఇది చూసిన మెగా ఫ్యాన్స్ పవర్ స్టార్ విజయం చూశాక ఆర్జీవీకి ఓ క్లారిటీ వచ్చినట్లు ఉంది. ఆయన నోట మాట కూడా రాలేదని ట్వీట్ చూస్తే అర్థం అవుతుందని చెప్పుకొస్తున్నారు. మొదటి సారి రామ్ గోపాల్ వర్మ దండం సింబల్‌తో అందరికీ షాకిచ్చాడంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఒకొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed