- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
‘ఆన్ ది రోడ్’ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ
దిశ, వెబ్‌డెస్క్: రాఘవ్ తివారీ, స్వామి మెహ్రా, కలిసి నటించిన చిత్రం ‘ఆన్ ది రోడ్’. దీనిని డైరెక్టర్ సూర్య లక్కోజు రూపొందించాడు. అలాగే మధు విఆర్ బ్యానర్ ఎస్‌పిఎల్ పిక్చర్స్‌పై నిర్మాతలు సూర్య లక్కోజు, రాజేష్ శర్మ తెరకెక్కించారు. కర్ణ్ శాస్త్రి, రవి సింగ్, రాహుల్ కుమార్, ఎస్‌ఎస్. అంగ్‌చోక్ కీలక పాత్రల్లో నటించారు. పూర్తిగా లడఖ్ ప్రాంతంలో తెరకెక్కించిన మొదటి భారతీయ చిత్రం ‘ఆన్ ది రోడ్’ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను, ట్రైలర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన సినిమాలో విజువల్ మూడ్ ను, స్టైలిష్ లుక్ ను మెచ్చుకోవడమే కాకుండా ఇలాంటి అవుట్ పుట్ తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఆన్ ది రోడ్ టీమ్ మెంబర్స్ ను ప్రశంసించారు. సినిమా విజయం సాధించాలని శుభాభినందనలు తెలియజేశారు. ఈ చిత్ర దర్శకుడు సూర్య లక్కోజు గతంలో రామ్ గోపాల్ వర్మతో కలిసి పలు చిత్రాలకు పని చేయడం విశేషం. ప్రముఖ చిత్ర నిర్మాత తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(TFCC) ఉపాధ్యక్షులు ముత్యాల రామ్ దాస్ ఈ సినిమా విడుదలకు సహకారం అందిస్తూ ఈ ప్రాజెక్టు లో ఒక భాగం అయ్యారు. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ట్రైలర్ మరియు ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉన్నాయని తప్పకుండా ప్రేక్షకాదరణ చూరగొంటుదని ఆశాభావం వ్యక్తం చేశారు.
- Tags
- Ram gopalvarma