పుట్టబోయే బిడ్డ కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్..!

by Hamsa |
పుట్టబోయే బిడ్డ కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్..!
X

దిశ, వెబ్ డెస్క్: మెగా హీరో రామ్ చరణ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అనేక సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రెగ్నెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఉపాసన కోసం, పుట్టబోయే బిడ్డ కోపం రామ్ చరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక ఉపాసన డెలివరీ టైమ్ లో చరణ్ పక్కనే ఉండాలని షూటింగ్‌లకు మూడు నెలలు గ్యాప్ ఇచ్చాడని తెలుస్తోంది. రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పుట్టబోయే బిడ్డపై రామ్ చరణ్ ఇప్పటినుంచే చూపిస్తున్న ప్రేమను చూసి ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.

Advertisement

Next Story