Ram Charan | అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ లండన్ రిసెప్షన్‌కు రామ్ చరణ్ .. ఫొటోస్ వైరల్

by Sujitha Rachapalli |
Ram Charan | అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ లండన్ రిసెప్షన్‌కు రామ్ చరణ్ .. ఫొటోస్ వైరల్
X

దిశ, సినిమా: అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి సందడి ఇంకా కొనసాగుతుంది. మూడు నెలలుగా జరుగుతున్న పెళ్లి సంబరాలు ఇప్పటికే ఆకాశాన్నంటగా.. రాబోయే రోజుల్లోనూ మరింత గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే లండన్ లో రిసెప్షన్ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మూడు రోజుల క్రితమే అంబానీ ఫ్యామిలీ ఆల్రెడీ అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. కాగా ఈ ఫంక్షన్ స్టార్స్ ఎవరు అటెండ్ అవుతున్నారనే విషయంపై చర్చ జరుగుతుంది. హాలీవుడ్ స్టార్స్ దాదాపు అందరూ అటెండ్ అయ్యే కార్యక్రమానికి బాలీవుడ్, టాలీవుడ్ నుంచి కూడా హాజరుకానున్నారు.

ఈ క్రమంలో ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తుంది. పైగా ప్రస్తుతం మెగా పవర్ స్టార్ లండన్ లోనే ఉండగా.. తన పెట్ డాగ్ రైమ్ తో క్యూట్ ఫోటోషూట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రెట్టీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో చెర్రీ అంబానీ ఇంటి రిసెప్షన్ కు అటెండ్ అయ్యాకే ఇండియా వస్తాడని అంటున్నారు నెటిజన్లు.



Next Story