- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామ్ చరణ్-శ్రియా ఒకే స్కూల్‌లో, కలిసి యాక్టింగ్ నేర్చుకున్న వీడియో వైరల్
దిశ, సినిమా: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ సీనియర్ హీరోయిన్ శ్రియ ఒకే స్కూల్‌లో కలిసి యాక్టింగ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాల్లో రాణించాలనే ఆసక్తితో కొంతమంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ముందు యాక్టింగ్ మెళకువలు నేర్చుకుంటారు. ముంబయిలో కిశోర్ నమిత కపూర్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూషన్ ఉన్న విషయం తెలిసిందే. అయితే అందరిలాగే మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా ఆ యాక్టింగ్ స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు.
అదే సమయంలో చరణ్ తో పాటు తెలుగు సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ సినిమాల్లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టాలనే ఇంట్రెస్ట్‌తో యాక్టింగ్ నేర్చుకుంది. ఈ ఇన్‌స్టిట్యూషన్‌లో చరణ్, త్రిష కలిసి ఎక్కువ సమయం పాటు యాక్టింగ్ ప్రాక్టీస్ చేసేవారట. వీరిద్దరు కలిసి యాక్టింగ్‌లో భాగంగా నాటకాలు కూడా వేశారట. అయితే తాజాగా శ్రియా-రామ్ చరణ్ కలిసి ఓ లవ్ సన్నివేశం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చరణ్-శ్రియా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు.. ముస్లిం అమ్మాయి, అబ్బాయిలా ఉన్నారంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
ఇద్దరు కలిసి ఒకేసారి యాక్టింగ్ నేర్చుకున్నప్పటికీ చరణ్ కంటే ముందు హీరోయిన్ శ్రియనే ‘ఇష్టం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగార్జున సరసన సంతోషం చిత్రంలో, బాలయ్య సరసన చెన్నకేశవరెడ్డి, మెగాస్టార్ పక్కన ఠాగూర్, అర్జున్, బాలు.. వంటి అగ్ర హీరోల సినిమాల్లో అవకాశం దక్కించుకుని అతి తక్కువ సమయంలో స్టార్ గుర్తింపు సంపాదించుకుంది.
ఇక రామ్ చరణ్ చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో నటించి పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక్కడ విశేషం ఏంటంటే? చరణ్‌తో కలిసి యాక్టింగ్ నేర్చుకున్న ఈ భామ ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్‌కు అమ్మ రోల్ నటించడం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.