Ram Charan : అయ్యో పాపం.. ఇప్పటికీ రామ్ చరణ్‌కు ఆ కోరిక తీరలేదంట!

by Jakkula Samataha |   ( Updated:2024-02-04 05:06:45.0  )
Ram Charan : అయ్యో పాపం.. ఇప్పటికీ రామ్ చరణ్‌కు ఆ కోరిక తీరలేదంట!
X

దిశ, ఫీచర్స్ : చిరుత సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన మొదటి సినిమా పర్వాలేదనిపించినా..రెండో మూవీ మగధీరతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

ఇక తర్వాత వరసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా,త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్‌కు వరల్డ్ వైడ్‌గా మంచి ఫేమ్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ నటుడు గేమ్ చేంజర్ మూవీ షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నాడు.

ఇక తాజాగా చెర్రీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ తనకు పాప పుట్టడం, సినిమాలు కూడా పాన్ ఇండియాల లెవల్‌లో మంచి హిట్ అందుకోవడంతో ఈ హీరో చాలా సంతోషంగా ఉంటున్నాడు. అన్ని కోరికలు అలా తీరిపోతున్నాయని అనుకుంటారు అందరూ.. కానీ చెర్రీకి ఒక కోరిక అలానే మిగిలిపోయిందంట.

అది ఏమిటంటే? తన ఫేవరెట్ బ్యూటీ అనుష్క శెట్టితో చరణ్ స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకున్నాడంట. గతంలో వీళ్ల కాంబోలో ఎన్నో సినిమాలు ట్రై చేశారంట మేకర్స్. కానీ అనుష్క నేను చరణ్‌కు సిస్టర్‌లా ఉంటాను, మా కాంబినేషన్ అస్సలే సెట్ కాదు అంటూ వచ్చిన ఆఫర్స్ రిజెక్ట్ చేసిందంట. ఇలా వీరి కాంబో మిస్ అయ్యింది. తన ఫేవరెట్ హీరోయిన్‌తో నటించాలనే కోరిక చెర్రీకి అలానే ఉండిపోయిందంట.

Advertisement

Next Story