ఫుడ్ బిజినెస్‌లోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ హీరోయిన్

by Hamsa |
ఫుడ్ బిజినెస్‌లోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ హీరోయిన్
X

దిశ, సినిమా: సినీ సెలబ్రిటీలు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే పలు బిజినెస్‌లు పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్న విషయం తెలిసిందే. ఏ మాత్రం తగ్గకుండా వరుస బిజినెస్‌తో లాభాలు పొందుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది బిజినెస్ రంగంలో అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు. అయితే ఈ లిస్ట్‌లో ఓ యంగ్ హీరోయిన్ కూడా చేరింది, తాజాగా, యంగ్ బ్యూటీ నేహ శర్మ ఢిల్లీలోని వసంత విహార్‌లో ‘కాల్ మీ టెన్’ పేరుతో జపనీస్ రెస్టారెంట్ స్టార్ట్ చేసినట్లు సమాచారం.

దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నారు. కాగా, ఈ అమ్మడు రామ్ చరణ్ ఫస్ట్ మూవీ ‘చిరుత’లో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను మైమరిపించింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’ మూవీ నటించింది. కానీ పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. ఇటీవల ‘బ్యాడ్ న్యూజ్’ మూవీలో కనిపించింది. ప్రజెంట్ హేరా ఫేరీ-3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Next Story

Most Viewed