విడుదలకు ముందే రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సెన్సేషనల్ రికార్డు!

by Anjali |   ( Updated:2023-09-28 07:47:01.0  )
విడుదలకు ముందే రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సెన్సేషనల్ రికార్డు!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న హీరో రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ అగ్ర దర్శకుడు శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ అనే భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా చేస్తోంది. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ రైట్స్ గురించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. #GameChanger పోస్ట్ థియేటర్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ZEE5 వారు రూ.270 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనప్పటికీ.. ఇది రికార్డ్ ప్రైస్ అని చెప్పాలి. కాగా ఈ సినిమాకు మొదట అనుకున్న దానికన్నా భారీగా ఖర్చు పెరిగిపోతోందని సమాచారం. నిర్మాత దిల్ రాజు 50వ చిత్రం కావడంతో ఖర్చు విషయంలో తగ్గేదేలే అంటున్నారట. ఈ చిత్ర క్లైమాక్స్ ఇప్పటి వరకూ చూడని విధంగా డైరెక్టర్ శంకర్ అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నాడట. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నారని సమాచారం.

Advertisement

Next Story