ఎమోషనల్ అయిన రామ్ చరణ్.. తారక్‌ను మిస్ అవుతున్నానంటూ..

by Vinod kumar |   ( Updated:2023-03-04 09:24:16.0  )
ఎమోషనల్ అయిన రామ్ చరణ్.. తారక్‌ను మిస్ అవుతున్నానంటూ..
X

దిశ, సినిమా: ఎపిక్ ఫిక్షన‌ల్ పీరియాడిక్‌ యాక్షన్ డ్రామా RRRను మార్చి 1న లాస్ ఏంజిల్స్‌లోని ఏస్ హోటల్ థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ వేడుక‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు ద‌ర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సంగీత ద‌ర్శకుడు ఎం.ఎం. కీరవాణి, సూపర్ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్‌ కుమార్ హాజరయ్యారు. RRR ప్రద‌ర్శన పూర్తయిన వెంట‌నే యూనిట్ స‌భ్యుల‌ను థియేటర్లో చ‌ప్పట్లతో గౌర‌వించారు. స్టాండింగ్ ఒవేష‌న్ ఇచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చరణ్.. ఇంతటి ఆదరాభిమానాలు పొందేందుకే ఎంత కష్టానికైనా వెనుకాడలేదని ఎమోషనల్ అయ్యాడు. తనకు తాను విద్యార్థిగా అనుకుంటానని.. రాజమౌళి తనకు గురువు అని చెప్పుకొచ్చాడు. ‘‘ఆర్ఆర్ఆర్’ కారణంగా తారక్‌కు దగ్గరయ్యాను. అందుకే సినిమాలో సోదరభావం చూపించడం తేలికైంది. ప్రస్తుతం తారక్‌ను ఈ వేదికపై మిస్ అవుతున్నాను’ అని తెలిపాడు చెర్రీ.

Also Read..

1.RRR: చేతిలో చీపురు, చెత్తబుట్టతో తారక్, చరణ్!

2.బాబాయ్‌ని చూసి లేచి నిల్చున్న Jr.NTR.. పట్టించుకోకుండా వెళ్లిన బాలయ్య! (వీడియో)

Next Story

Most Viewed