- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్రెస్ట్ లేకపోతే రామ్ చరణ్ సినిమాను వదిలేయ్.. డైరెక్టర్ శంకర్‌కు ఫ్యాన్స్ వార్నింగ్
దిశ, బెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్‌కు వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, రామ్ చరణ్ పుట్టినరోజు నుంచి ఇప్పటివరకు సినిమా నుంచి అప్‌డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా డైరెక్టర్ శంకర్‌ను, నిర్మాత దిల్‌రాజును ఓ ఆటాడుకున్నారు.
దీంతో అభిమానుల ఒత్తిడి తట్టుకోలేక ఈ దీపావళి పండక్కి సినిమా నుంచి తొలి పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చి దాదాపు వారం కావొస్తున్న మళ్లీ ఎలాంటి సమాచారం లేదు. మరో రెండ్రోజుల్లో పండగ ఉండటంతో అసలు పాట రిలీజ్ చేస్తారా? లేదా? అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మాత్రం పాటకు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వలేదో ఇండియా వైడ్ నెగిటివిటితో ట్రెండ్ చేస్తామని డైరెక్టర్, నిర్మాతను హెచ్చరించారు. అంతేకాదు.. ‘ఇంట్రెస్ట్ లేకపోతే రామ్ చరణ్ సినిమాను వదిలేసి కమల్ హాసన్‌తో ఇండియన్ 2,3,4,5 అంటూ వరుసగా తీసుకోండి ఎవరికీ ప్రాబ్లం లేదు’ అని డైరెక్టర్ శంకర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు.