రామ్, బోయపాటి.. దసరా కనుకగా పెద్ద ప్లానే వేశారే!

by Anjali |
రామ్, బోయపాటి.. దసరా కనుకగా పెద్ద ప్లానే వేశారే!
X

దిశ, వెబ్‌డెస్క్: వరుసగా రెండు ప్లాప్స్ చవిచూసిన ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని దర్శకుడు బోయపాటి శ్రీనుతో జతకట్టాడు. అఖండ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ దర్శకుడు ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తర్వాత ప్రాజెక్ట్ ప్రకటించడం, దాన్ని పట్టాలెక్కించడం చకచకా జరిగిపోయాయి. రామ్‌తో ఆయన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నట్లు గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. రామ్ ఎనర్జీకి తగ్గట్లుగా ఊర మాస్ యాక్షన్ సబ్జెక్టు ఎంపిక చేసినట్లు సమాచారం. గత ఏడాది రెగ్యులర్ షూటింగ్ మొదలు కాగా.. ఇప్పటికే చాలా వరకు పూర్తి చేశారట.

అయితే తాజాగా రామ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అప్డేట్ వచ్చేసింది. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు హీరో రామ్ తెలిపారు. దసరా బరిలో నిలుస్తున్న రామ్, బోయపాటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. రామ్ చిత్రానికి అద్భుతమైన రిలీజ్ డేట్ కుదరగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దుమ్మురేపే యాక్షన్ సన్నివేశాలు, ఊరమాస్ ఎలివేషన్స్‌తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమాకి టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. శ్రీనివాసా చిత్తూరి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

Next Story